Friday 2 August 2013

EVIL NOT DEAD



చనిపోయిన వ్యక్తులు ప్రేతాత్మలుగా మారతారా..?, మారి మన మధ్యనే తిరుగుతన్నారా...? ఈ భయానక సందేహాలు మనలో చాలమందిలో మెదులుతూనే ఉన్నాయి. అందుకు కారణం లేకపోనూ లేదు. నిత్యం సమాజంలో చోటుచేసకుంటున్న పలు సంఘటనలకు కారణాలుగా మానవాతీత శక్తులను చూపుతున్నారు. ఈ మూఢనమ్మకాలను పలువురు కొట్టిపరేస్తున్నప్పటికి ఏదో ఒక కోణంలో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భయానక ఆకారలతో కూడిన పలు అనుమానస్పద ఫోటోగ్రాఫ్ లను మీకు చూపెడుతున్నాం. తవ్వకాల్లో బయటపడ్డ రక్త పిశాచాలు? పోలాండ్ లోని పురాతత్వ నిపుణులకు ఓ కట్టడానికి సంబంధించి నిర్వహించిన తవ్వకాల్లో భాగంగా భయానక అస్తిపంజరాలతో కూడిన సమాధులు బయటపడ్డాయి. ఈ అస్తిపంజరాలలో కొన్నింటికి తలలు వేరుకాబడి కాళ్ల దగ్గర ఉన్నాయి. దీంతో ఈ సమాధుల పై అనేక సందేహాలు వ్యక్తమవటంతో పాటు భయాందోళణతో కూడిన వాతావరణం అక్కడ నెలకుంది.దక్షిణ పోలాండ్ లోని గిల్ వైస్ పట్టణంలో చేపట్టిన తవ్వకాల్లో భాగంగా ఈ అస్లిపంజరాలుబయటపడ్డాయి. ఈ స్కెలిటన్ లు 16 లేదా 17వ శతాబ్ధం నాటివిగా నిపుణులు భావిస్తున్నారు. పురాతత్వ నిపుణులు ఇటీవల కాలంలో అనేక సందేహాస్పద సమాధులను తవ్వకాల్లో భాగంగా వెలికితీసిన విషయం తెలిసిందే. తాజాగా బయటపడిన ఈ సమాధులను పలువురు రక్త పిశాచాలకు చెందినవిగా చర్చించుకుంటుంటే మరి కొందరు మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. ఈ అస్తిపంజరాలు రక్త పిశాచాలవేనా..? లేకుంటే శిక్షకు గురైన వారివా..? అన్న కోణంలో నిపుణులు పరిశోధన సాగించాల్సి ఉంది.

Read more at: http://telugu.gizbot.com/news/old-camera-pictures-with-ghosts-008107.html

No comments:

Post a Comment